Monday, December 15, 2008

దత్త స్తవం


జయ గురు దత్త

శ్రీమహా గణాధిపతయే నమః

ఈ పుటలలో, ఇది నా మొదటి తెలుగు వ్రాత. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి దివ్యాశీస్సులు భక్తులందరికీ సదా లభించుగాక

ఇక, మనందరికీ అత్యంత ప్రియమైన దత్తస్తవం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.

1వ శ్లోకం

దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్త వత్సలమ్

ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు.

భావము

భక్తులపట్ల వాత్సల్య భావాన్ని గలిగియుండి, మహాత్ముడై, వరాలను కురిపించే మహాత్ముడు ఆ దత్తాత్రేయ స్వామి. ఆయనకు నమస్కరిస్తున్నాను.

స్మరించగానే, భక్తుల కష్టాలను హరించడానికై వెడలే ఆ దత్తాత్రేయుడు మనను రక్షించుగాక

తరువాతి శ్లోకం అర్థం మళ్ళీ తెలుసుకుందాం.

జయ గురు దత్త

No comments:

Post a Comment